జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 31 సెల్ 9550978955
చిలకలూరిపేట పట్టణ ములోని పాత పశువుల సంత ఎదురు ఐడీసీ ప్రహరీకి (గోడ) అనుకోని గతంలో జీవనోపాధి కోసం సుమారుగా రూ.50 వేల నుండి లక్ష రూపాయలు సొంత నిధులతో ఖర్చుపెట్టి షాపులు ఏర్పాటు చేసుకున్నారు. ఆ షాపులను మునిసిపల్ అధికారులు ఆక్రమణ తొలగింపులో భాగంగా తొలగింప చేసి నూతనంగా షాపులు ఏర్పాటు చేసి ఇస్తామని మున్సిపల్ అధికారులు చెప్పారు. దీంతో షాపుల నిర్వాహకుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నూతనంగా నిర్మించిన షాపులు ఎప్పుడు ఇస్తారో అని వేచి చూస్తున్నారు. సుమారుగా 20 మంది షాపుల నిర్వాహకులు ఉన్నారు. వారిలో 1 ఏడుకొండలు కోటయ్య. 2. గుంజి బాలసుబ్రమణ్యం,3 ఆదిలక్ష్మి,4, బార్బర్ షాపు. 5 చికెన్ కొట్టు, 6, హరిశంకర్ 7,ట్రావెల్స్ షాప్,8, ఎమ్మార్పీఎస్ నాగరాజు,9, రత్నం ,10, సొంటి శీను.11, చెన్నకేశవుల రాంబాబు. 12, మాజీ కౌన్సిలర్ కోటా నాయక్ ,13, జనసేన కరిముల్లా, 14, ముస్లిమ్స్ వెల్డింగ్ షాప్,తో పాటు మరో 6 గురు ఉన్నారు. వీరు గతంలో మున్సిపల్ కార్యాలయానికి పన్నుల సైతం కట్టి ఉన్నారు. విద్యుత్ మీటర్లు వీరి పేర్లతోనే ఉన్నాయి. మున్సిపాలిటీ పట్టణ ప్రణాళికల విభాగ అధికారులు వారికి నచ్చిన పేర్లు రాసి జాబితా తయారు చేశారనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. సంబంధిత అధికారులకు జాబితాను అడుగుతా ఉంటే తెలియదు అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. నూతన షాపుల జాబితా ఎవరి దగ్గర ఉందో అర్థం కాక లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


