జనం న్యూస్ మార్చి 31: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల
కేంద్రంలో మంగళవారం సీఎం సహాయ నిధి ద్వారా మొత్తం రూ.3,42,000 విలువైన చెక్కులను 11 మంది లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. లబ్ధిదారుల వివరాలు ఇలా ఉన్నాయి: రొక్కెడ లింబవ్వ రూ.56,000, దాసరి లక్ష్మి రూ.60,000, సుధానవేణి విజయ రూ.22,000, కల్లూరు లక్ష్మి రూ.19,000, పుల్లూరి రాధ రూ.24,000, కుశ లావణ్య రూ.15,000, పుల్లూరి గంగయ్య రూ.31,000, మెరుగు అనిల్ రూ.15,500, బోడ వెంకటేష్ రూ.22,500, దొబ్బల సుష్మ రూ.20,000, బర్మా పెద్ద గంగారం రూ.52,000 చెక్కులు అందుకున్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్సకు ఖర్చు చేసిన వారు తమ బిల్లులు సమర్పిస్తే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయంఅందజేస్తామని తెలిపారు. ప్రజల అవసరాలు తీర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు, ఇంటికి ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, సన్న బియ్యం, వడ్లకు బోనస్ వంటి పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చెక్కుల మంజూరులో సహకరించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునిల్ కుమార్‌కు కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో శివన్నోల్ల శివకుమార్, రేండ్ల రాజారెడ్డి, ఉపసర్పంచ్ సున్నపు శ్రీను, బద్దం లింగారెడ్డి, గడ్డం జీవన్, ముస్కు మోహన్, పన్నాల నర్సారెడ్డి, కురాకుల బొర్రాన్న, సున్నపు అంజయ్య, ముస్కు నర్సింగ్, రాజారాం సహదేవ్, కొలిప్యాక రవి, ఎస్కే రషీద్, దండేవోయిన సాయన్న, దండేవోయిన ఆశన్న, దండేవోయిన సాయి, ఓర్సు రాములు, అన్నేల మురళి గౌడ్, దండేవోయిన సంతోష్, దొబ్బల చిన్న లక్ష్మణ్, జంగాల పెద్దోళ్ల శ్రీను, ఇబ్రైంపట్నం చిన్న భూమన్న, కనగృతి ఉషన్న, ఎస్కే సలీం, ఏలేటి చిన్న బాలయ్య, ఇబ్రైంపట్నం నర్సయ్య, తలారి మోహన్, మేరుగు సురేష్, ఇబ్రైంపట్నం చిన్న గంగాధర్, గుండ్ల రామచందర్, ఇందూర్ టీడీపీ సాయన్న, కుశ సురేష్, మాదస్తూ చిన్న గంటన్న, సున్నపు గణపతి, కంచరి రవి, లాలు, మేరుగు సంజీవ్, గుర్రం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.



