జనంన్యూస్. 01 నిజామాబాదు.రురల్. శ్రీనివాస్ పటేల్.
జిల్లా టైక్వాండో క్రీడాకారులు హైదరాబాద్ లోని యూసుఫ్ గూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో తెలంగాణ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో 14 వ. టైక్వాండో రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహించారు. అందులో నిజామాబాద్ కి చెందిన అమేజింగ్ టైక్వాండో క్రీడాకారులు తమ ప్రతిభను చూపి 15 బంగారూ పథకాలు, 6 సిల్వర్ మేడల్స్ 7 బ్రానజ్ మేడల్స్ సాధించారాని అమేజింగ్ టైక్వాండో ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అడిషనల్ జడ్జ్ దుర్గాప్రసాద్ .చేతుల మీదగా మెడల్స్ ఇవ్వడం జరిగింది పిల్లలు చదువులో పాటూ అన్ని రంగాల్లో ఉండాలని మన రాష్టనికి మంచి పేరు తీసుకురావాలని టైక్వాండలాంటి క్రీడను పిల్లల నేర్చుకుంటే ఆత్మ రక్షణ ధైర్యం క్రమశిక్షణ శారీరకంగా బలంగా ఉంటారని వాళ్ళని పంపిస్తున్న తల్లిదండ్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ కోచ్ మనోజ్ ని అభినందించారు పిల్లలతో పాటు తల్లిదండ్రులు కోచ్ నాగరాజ్ పాల్గొన్నారు.


