అచ్యుతాపురంలో పుట్టగొడుగుల్లా హాస్టళ్లు కనీస పర్యవేక్షణ కరువు
జనం న్యూస్, ఏప్రిల్ 01,అచ్యుతాపురం:
విశాఖపట్నం ఆనందపురం ప్రాంతానికి చెందిన అలబాని రామకృష్ణ (22)అచ్యుతాపురం సెజ్ లో ఉన్న లారస్ కంపెనీలో పనిచేస్తూ అచ్యుతాపురం మండలం లోగల మనోహర్ హాస్టల్ లో మూడవ అంతస్తులో నివాసం ఉంటున్నారు.ప్రమాదవశాత్తు మార్చి 31 మంగళవారం ఉదయం సుమారు ఐదున్నర గంటల సమయంలో హాస్టల్ లో ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు.స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా..అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.మృతుడి తండ్రి సూర్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అచ్యుతాపురం సీఐ చంద్రశేఖర్ తెలిపారు.అచ్యుతాపురం మండలం లోని పలు ప్రాంతాల్లో ఉన్న అపార్ట్మెంట్లో ఎటువంటి అనుమతులు లేకుండా అచ్యుతాపురం మండలంలో పుట్టగొడుగుల్లా హాస్టళ్లు నడుపుతున్నారని,నివాసానికి మాత్రమే అనుమతులు ఉన్నఅపార్ట్మెంట్లను వాణిజ్యపరంగా వినియోగిస్తున్నారని,ఈ హాస్టల్ కు ట్రేడ్ లైసెన్స్,ఫుడ్ లైసెన్స్,కమర్షియల్ గ్యాస్ కనెక్షన్ వంటివి ఏవీ లేవని,చట్టబద్ధమైన అనుమతులు లేకుండా వ్యాపారం చేస్తున్న వారిపైనా, వారికి అద్దెకు ఇచ్చిన వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


