Listen to this article

బిచ్కుంద ఏప్రిల్01 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం కందరపల్లి-బిచ్కుంద రహదారిపై బుధవారం రాధాకృష్ణ వాహనాలను తనిఖీ చేసినారు. వాహనాల తనిఖీల సందర్భంగా ద్విచక్ర వాహనలు ,కార్లు,రవాణా వాహనాలు వాహనాలపై ఉన్న చాలాన్లు లేదా ఆర్ సి బుక్కు, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లు తనిఖీలు చేశారు. వాహనదారులను అవగాహన కల్పిస్తూ ద్విచక్ర వాహనా దారులకు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందిగా, కార్ డ్రైవర్లకు సీట్ బెల్ట్ పెట్టుకుని డ్రైవింగ్ చేయవలసిందిగా సూచించారు. ఇట్టి కార్యక్రమంలో కానిస్టేబుల్ అశోక్ బాల్రాజ్ పాల్గొన్నారు