Listen to this article

బిచ్కుంద ఏప్రిల్ 01 జనం న్యూస్

మేరా యువ భారత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో నిర్వహించిన క్రీడ పోటీల్లో బాన్సువాడ ,బిచ్కుంద, గాంధారి, ఎల్లారెడ్డి, నిజాంసాగర్ బ్లాక్ లో నుంచి క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా బాన్సువాడ పట్టణ సిఐ శ్రీధర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి చేతుల మీదుగా జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు.ఈ క్రీడా పోటీలలో బిచ్కుంద డిగ్రీ కళాశాల విద్యార్థులు వాలీబాల్ లో ఇర్ఫాన్ టీం ద్వితీయ బహుమతి , చెస్ లో మహేష్ మొదటి బహుమతి , 100 మీటర్ల పరుగు పందెం లో కె.భరత్ మొదటి బహుమతి ని పొందారు . గెలుపొందిన విద్యార్థులకు జిల్లా యూత్ ఆఫీసర్ శైలి బెల్లల్ చేతుల మీదుగా అలాగే స్థానిక అధికారుల చేతుల మీదు గా బహుమతులు ప్రధానం చేశారని కళాశాల స్పోర్ట్స్ ఇంచార్జ్ డాక్టర్ వై .సంజీవరెడ్డి తెలిపారు. గెలుపొందిన విద్యార్థులకు మరియు అధ్యాపకులకు కళాశాల ప్రిన్సిపాల్ కె .అశోక్ అభినందలు తెలిపారు. అధ్యాపకులు ఆనంద్ రెడ్డి మరియు విద్యార్థులు పాల్గొన్నారు