Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 1 సెల్ 9550978955

మెడికల్ మాఫియాపై సమరశంఖం ఆరోగ్య‌శ్రీ బ‌కాయిలకు నిధులు విడ‌ద‌ల చేయాలి రాజ‌ధాని పేరుతో అభివృద్ది కేంద్రిక‌ర‌ణ వద్దు మే నెల‌లో కోట‌ప్ప‌కొండ‌లో ఏఐవైఎఫ్ ఆధ్వ‌ర్యంలో శిక్ష‌ణా త‌ర‌గ‌తులు
సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి గుజ్జ‌ల ఈశ్వ‌ర‌య్య చిల‌క‌లూరిపేట‌: కూట‌మి ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌టంలో విఫ‌లం చెందింద‌ని సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి గుజ్జ‌ల ఈశ్వ‌ర‌య్య విమ‌ర్శించారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర రాజ‌కీయ‌,సాంస్క్ర‌తిక‌, విద్య‌,వైద్య రాజ‌కీయ శిక్ష‌ణ త‌రగ‌తులు మే నెల‌లో ఐదు రోజుల పాటు కోట‌ప్ప‌కొండ‌లో నిర్వ‌హించ‌నున్నారు. శిక్ష‌ణా త‌ర‌గ‌తుల నిర్వ‌హ‌ణ కోసం పార్టీ నేత‌ల‌తో క‌ల‌సి కోట‌ప్ప‌కొండ ను సంద‌ర్శించి, పార్టీ ముఖ్య నేత‌ల‌తో బుధ‌వారం ప‌ట్ట‌ణంలోని సీపీఐ కార్యాల‌యంలో స‌మావేశ‌మయ్యారు. అనంత‌రం విలేక‌ర్ల స‌మావేశంలో ఈశ్వ‌ర‌య్య మాట్లాడారు. యువ‌త‌లో దేశ‌భ‌క్తి భావాన్ని ప్రేరేపించి, వారిలో సేవా భావాన్ని రంగ‌రించి, చైత‌న్యం క‌లిగిన కార్య‌క‌ర్త‌లుగా త‌ర్ఫీదు ఇవ్వ‌డానికి ఈ శిక్ష‌ణ త‌ర‌గ‌తులు దోహ‌ద‌ప‌డ‌తాయ‌న్నారు.హామీల అమ‌లులో విఫ‌లం..రాష్ట్రంలోని వెనుక‌బ‌డిన ప్రాంతాల అభివృద్దికి గ‌తంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రెండు సంవ‌త్స‌రాల కాలంలో హామీల అమ‌లులో వెనుక‌బ‌డి ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వ హ‌యాంలో విధ్వాంసం జ‌రిగింద‌ని గ‌గ్గోలు పెట్టారో దాని క‌న్నా ఎక్కువ‌గా రెండు సంవ‌త్స‌రాల కాలంలో విద్వాంసం జ‌రుగుతుంద‌ని ద్వ‌జ‌మెత్తారు. స్ప‌ర‌స్ప‌రం భౌతిక దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు. భిన్న‌భిప్రాయం క‌లిగిన వారిపై దాడులు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. అభివృద్దిలో అమ‌డ దూరం కూడా పోలేని స్థితిలో కూట‌మి ప్ర‌భుత్వం ఉంద‌ని పేర్కొన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు ప‌ల్నాడు జిల్లానే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంద‌ని చెప్పారు. ప‌క్క‌నే ఉన్న నాగార్జున సాగ‌ర్ పొంగిపొర్లుతుంటే ప‌ల్నాడులో అనేక ప్రాంతాలు గుక్కెడు నీటికి అల్లాడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అనేక ప్రాంతాల‌కు సాగునీరు, తాగునీరు అందించే వరికపూడిశెల ప్రాజెక్టు ను పూర్తి చేయ‌లేని స్థితిలో ప్ర‌భుత్వం ఉంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇది నిన్న మొన్నటి సమస్య కాదు, దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న నీటి సమస్యని, దీనికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించడంలో విఫలమైందన్నారు. “ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి నిచ్చెన వేసినట్లుంది బాబు గారి విజన్. ఇక్కడ రూ. 500 కోట్లు ఖర్చు చేస్తే, లక్ష ఎకరాలకు సాగునీరు అందే ప్రాజెక్టుల ఊసే లేదు. కానీ, 81 వేల కోట్ల రూపాయలతో ఎక్కడో పోలవరం దగ్గర నుంచి కర్నూలు జిల్లా పెనకచర్లకు నీళ్లు తీసుకెళ్తామని గొప్పలు చెబుతున్నారని, . ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు భరోసా ఇవ్వాల్సింది పోయి, గాలిలో మేడలు కడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులు స‌కాలంలో పూర్తి చేయాల‌ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే, సీపీఐ ఆధ్వర్యంలో ప్రాజెక్టుల దగ్గర నిద్రలు, పాదయాత్రలు చేపట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తామ‌ని హెచ్చ‌రించారు.రైతుల క‌ష్టాల‌పై స్పందించాలి…అన్నదాత సుఖీభవ అని పేరు మార్చారు తప్ప, రైతులకు ఇవ్వాల్సిన రూ. 40 వేల పెట్టుబడి సాయం ఏమైందని ఈశ్వ‌ర‌య్య ప్ర‌శ్నించారు. పొగాకు, మిర్చి, మొక్కజొన్న రైతులు గిట్టుబాటు ధర లేక విలవిల్లాడుతున్నారని, . కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 151 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో ఏ పంట‌కు గిట్టుబాటు ధ‌ర లేద‌ని మిర్చి, పొగాకు, మొక్క‌జొన్న క‌నీస పెట్టుబ‌డి ల‌భించ‌క రైతులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని వివ‌రించారు. మరోవైపు “ఆరోగ్యశ్రీ బకాయిలు 3 వేల కోట్లు చెల్లించకపోవడంతో, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు సేవలు నిలిపివేశార‌ని, ఇది సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేని పేర్కొన్నారు. ప్ర‌భుత్వం స్పందించి ఆరోగ్య‌శ్రీ బ‌కాయిల‌ను వెంట‌నే విడ‌ద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. మాటకు, చేతకు పొంతన లేని ప్రభుత్వం ఇది. రైతుల ఆత్మహత్యలు, నీటి ఎద్దడి, ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత.. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు.
మెడిక‌ల్ మాఫీయాను అరిక‌ట్టాలి..ఆరోగ్య సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని, ప్రజారోగ్య రంగాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న మెడికల్ మాఫియా ప్రజల జీవించే హక్కుపై పరోక్ష దాడి కొనసాగిస్తోందని, నాణ్యతలేని, బోగస్ మందులు విచ్ఛలవిడిగా మార్కెట్లో ప్రవేశించి వేలాది మంది ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్న మెడికల్ ఫార్మా మాఫియాను అరికట్టే వరకూ పోరాడతామని ఈశ్వ‌ర‌య్య అన్నారు. ఫార్మాస్యూటికల్ కంపెనీల అధిక లాభాల ఆశ, కార్పొరేట్ ఆసుపత్రుల వ్యాపార ధోరణి, పరీక్షల పేరుతో ల్యాబ్ సెంటర్ల భారీ దందా కలిసి ప్రజలను ఆర్థికంగా, శారీరకంగా దోచుకుంటున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు అభివృద్ది వీకేంద్రిక‌ర‌ణ జ‌ర‌గాలి…లోక్‌స‌భ‌లో రాష్ట్ర రాజ‌ధాని బిల్లుపై ఈశ్వ‌ర‌య్య స్పందిస్తూ 1972లోనే ప్ర‌త్యేక ఆంధ్ర‌రాష్ట్రానికి రాజ‌ధాని గుంటూరు-విజ‌య‌వాడ‌ల మ‌ధ్య ఉండాల‌ని సీపీఐ తీర్మానించింద‌ని గుర్తు చేశారు. బావేద్వేల‌తో ఆడుకోవ‌ద్ద‌ని, ప్రాంతాల మ‌ధ్య విష‌మ్యాల‌ను రెచ్చ‌గొట్ట‌వ‌ద్ద‌ని తెలిపారు. అయితే అభివృద్ది వీకేంద్రిక‌ర‌ణ కావాల‌ని, వెనుక‌బ‌డ్డ ప్రాంతాల అభివృద్దికి కృషి చేయాల‌ని కోరారు. అలా కాకుండా రాజ‌ధాని పేరుతో ఒకే ప్రాంతంలో నిధులు కేంద్రికృతం చేస్తే ప్రాంతాల వైష‌మ్యాలు పెరిగే అవ‌కాశం ఉంద‌న్నారు. కార్య‌క్ర‌మంలో సీపీఐ జిల్లా కార్య‌ద‌ర్శి ఏ మారుతీ వ‌ర‌ప్ర‌సాద్‌, స‌హాయ కార్య‌ద‌ర్శులు షేక్ హుస్సేన్‌, కాసా రాంబాబు, ఏరియా కార్య‌ద‌ర్శి తాళ్లూరి బాబురావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్య‌క్ష, కార్య‌ద‌ర్శులు సంతోష్‌, యుగంధ‌ర్‌, ఆర్గ‌నైజింగ్ కార్య‌ద‌ర్శి షేక్ సుబాని, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి బి నాస‌ర్‌జి, రైతు సంఘం జిల్లా కార్య‌ద‌ర్శి ఉల‌వ‌ల‌పూడి రాము, నాయ‌కులు బూదాల శ్రీ‌నివాస‌రావు, చెరుకుప‌ల్లి నిర్మ‌ల‌, ధ‌న్‌రాజ్‌, తిరుప‌త‌య్య త‌దిత‌రులు పాల్గొన్నారు.