జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 1 సెల్ 9550978955
చంద్రబాబు నాయకత్వమంటేనే ప్రజలకు నిత్య సంతోషం.. ప్రతి రోజూ సంక్షేమం.అవకాశవాదులకు అవకాశమిచ్చినందునే ప్రజలు ఐదేళ్లు ఎంతో నష్టపోయారు.సమస్యలు పరిష్కరించే ప్రభుత్వాన్ని, నాయకుల్ని ప్రజలు విశ్వసించాలి.ప్రపంచంలో ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో లేనివిధంగా ప్రతి కుటుంబానికి చంద్రబాబు తిరుగులేని సంక్షేమాన్ని అందిస్తున్నారు.దొంగల్ని నమ్మితే తాత్కాలిక ప్రయోజనం.. శాశ్వత నష్టం.పలు వార్డులు, గ్రామాల్లో పింఛన్లు పంపిణీ చేసిన ప్రత్తిపాటి.చంద్రబాబు నాయకత్వంలో ప్రజలకు నిత్య సంతోషం.. ప్రతి రోజూ సంక్షేమమే అని, రాష్ట్రంలో మంచి పాలకులు ఉంటేనే ప్రజలు సమస్యలు పరిష్కారమై, వారికి కావాల్సినవన్నీ సకాలంలో అందుతాయని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.బుధవారం ఆయన పట్టణంలోని 9, 10, 32 వార్డులతో పాటు, చిలకలూరిపేట మండలం కోమటినేనివారిపాలెం.. మద్దిరాల, యడ్లపాడు మండలం కొండవీడు, చెంగిజ్ ఖాన్ పేట గ్రామాల్లో పేదలసేవలో కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తుల్ని ఉద్దేశించి, మీడియావారితో మాట్లాడారు.చంద్రబాబుది తిరుగులేని సంక్షేమం కూటమిప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం ఏమాత్రం వమ్ముకాలేదని, దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతినెలా రూ.4 వేల నుంచి రూ.15 వేల వరకు వివిధ వర్గాలకు అందిస్తున్న పింఛన్లే అందుకు నిదర్శనమని ప్రత్తిపాటి పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి చంద్రబాబు తిరుగులేని సంక్షేమం అందిస్తున్నారని ప్రత్తిపాటి చెప్పారు. తమకు అండగా ఉంటూ తమసమస్యల్ని పరిష్కరించే ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులపై ప్రజలు నమ్మకం, విశ్వాసం ఉంచాలని సూచించారు. ప్రజలు గతంలో అవకాశవాదుల్ని నమ్మి మోసపోయారని, దొంగల్ని పాలకుల్ని చేసినందుకు రాష్ట్రము, ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. అటువంటి నిర్ణయాలు భవిష్యత్ లో పునరావృతం కాకూడదని, తాత్కాలిక లబ్ధికోసం శాశ్వతంగా కష్టాల్ని కొనితెచ్చుకోవద్దని ఆయన హితవు పలికారు.కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, కామినేని సాయిబాబు, జిల్లా రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, మద్దినేని సుబ్బారావు, కందిమల్ల రఘురామారావు, బత్తినని శ్రీనివాసరావు , పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మండల కార్యదర్శి జాకోబు రాజు, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, గంగా శ్రీనివాసరావు , బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, నెల్లూరి రంజిత్, టీడీపీ నాయకులు మద్దిబోయిన శివ, ముద్దన నాగేశ్వరరావు, పోపురి వెంకయ్య, మద్దూరి శ్రీనివాస రెడ్డి, ముల్లా కరీముల్లా, గంజి శ్రీనివాసరావు, బేరింగ్ మౌలాలి, షేక్ అజారుద్దీన్, రాములు నాయక్, మస్తాన్ వలి, గుర్రం నాగపూర్ణ చంద్రరావు, మాలంపాటి సుబ్బారావు, పయ్యావుల సాంబశివరావు, గోరంట్ల నరసింహారావు, మన్నం శివయ్య, దేవదానం, మాలంపాటి ఉమా, తులవ మాణిక్యారావు, విజయ్ భాస్కర్, అజారుద్దీన్, సిలర్, బిక్కు, హఫీజ్ బెగ్, షేక్ షఫీ, అబ్జల్, పెద్దన్న, కేబుల్ బదేస, రామారావు, లోకేష్, సూరి, తులవ వెంకట్రావు, నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో, ఎంపీడీవోలు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


