జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 1 సెల్ 9550978955
రాజకీయ విధ్వంసకుడు లిఖించిన నెత్తుటి చరిత్రకు ప్రతిరూపం అమరావతి : ప్రత్తిపాటి
చంద్రబాబు నిర్మిస్తున్నది కేవలం రాజధాని కాదు… ప్రపంచం గర్వించే ప్రజాస్వామ్య సౌథం : ప్రత్తిపాటి
అమరావతి చట్టబద్ధతకు ఆమోదం ప్రజల త్యాగాన్ని గౌరవించడమే : ప్రత్తిపాటి
“అమరావతికి చట్టబద్ధత… తెలుగు ప్రజల భవిష్యత్ కు చెక్కుచెదరని భద్రత. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలపై ఉన్నతరిగిపోని నిబద్ధత.. ప్రజాస్వామ్య పరిరక్షణ పట్ల దేశ పాలకులకున్న నిజమైన కృతజ్ఞత. కూటమిప్రభుత్వ అభివృద్ధికి అవసరమైన స్థిరత్వానికి చట్టబద్ధత. రైతుల హక్కులకు, మహిళల ఆశలకు, యువత లక్ష్యాలకు సమగ్ర ప్రతిఫలత.అమరావతి మా హక్కు.. మా భవిష్యత్. నా రాష్ట్ర ప్రజల హక్కుల ప్రతీక. భూములిచ్చిన రైతులతో పాటు.. రాష్ట్ర ప్రజల భవిష్యత్ ను కూటమి ప్రభుత్వం అమరావతిగా నిర్మిస్తోంది. అమరావతి కేవలం రాజధాని కాదు… 5 కోట్ల ప్రజల ఆశలు, ఆవేశాలు, ఆకాంక్షలు, ఆత్మగౌరవాల కలబోత. గత 12 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్న మాటల్లో వర్ణించలేని హృదయవేదన. అమరావతి నగరం రైతుల చెమట.. మహిళల కన్నీరు.. ప్రజల కలలతో నిర్మితమవుతోందనేది జగమెరిగిన సత్యం.. జగన్ఎప్పటికీ గుర్తించలేని కఠోర వాస్తవం.అలాంటి విశ్వ నగరానికి చట్టబద్ధతతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ధర్మం, న్యాయం, చట్టం ప్రజల వైపే ఉన్నాయని చాటి చెప్పాయి. అమరావతి చట్టబద్ధతకు ఆమోదం ప్రజల త్యాగాన్ని గౌరవించడమే. చంద్రబాబు అమరావతిని మాత్రమే నిర్మించడం లేదు.. ప్రపంచం గర్వించే, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడించే గొప్ప ప్రజాస్వామ్య సౌధాన్ని నిర్మిస్తున్నారు.రాజకీయ విధ్వంసకుడి రక్త చరిత్రకు మరో రూపం అమరావతి విధ్వంసం లక్ష్యంగా సాగిన జగన్ పాలన… 5 కోట్ల ప్రజలకు మిగిల్చిన నెత్తుటి గాయాలకు సజీవ సాక్ష్యం. మహిళల మానప్రాణాలపై రాక్షసమూకలు వేసిన అభాండాలు, అపనిందలకు, వాటిని ఎదుర్కొన్న వారి పోరాటపటిమకు ప్రతిరూపం.. త్యాగధనులైన భూమిపుత్రుల నెత్తుటి సిరాతో స్వార్థపరుడైన రాజకీయ విధ్వంసకుడు లిఖించిన రక్తచరిత్రకు మరో రూపం మా అమరావతి.అమరావతిపై జగన్ వైఖరి.. ఏటి మల్లన్న, బోడిమల్లన్న తీరుగా ఉంది..అధికారంలో ఉన్నప్పుడు పలురకాలుగా.. ప్రజల చేతిలో భంగపడ్డాక మరో తీరుగా మాట్లాడటం పచ్చి అవకాశవాది, అస్యతవాది.. అవినీతిపరుడైన జగన్ కే చెల్లింది. అమరావతిపై జగన్ చెప్పే కట్టుకథల్ని ప్రజలు ఎప్పటికీ విశ్వసించరు. ప్రజా రాజధానిపై ఆయన వైఖరి ముమ్మాటికీ ఏటిమల్లన్న..బోడి మల్లన్న తీరుగానే ఉంది. కేంద్రం అమరావతికి చట్టబద్ధత కల్పించినందునే జగన్ రాజధానిపై గతంలో పాడిన రాగాన్నే కాస్త మార్చి పాడుతున్నాడు.నాడు జగన్ కు ప్లాన్ లు.. తిపాదనలు గుర్తురాలేదా అమరావతి నిర్మాణంపై ఇప్పుడు ప్లాన్ లు.. ప్రతిపాదనలు అంటున్న జగన్ ఐదేళ్లపాటు.. ప్రజల ఆకాంక్షల్ని ఎందుకు పట్టించుకోలేదు రైతుల త్యాగాల్ని అపహాస్యం చేసి, వారిని చిత్రహింసలకు గురిచేసినప్పుడు జగన్ కు రాజధాని ప్రణాళికలు గుర్తురాలేదా గతప్రభుత్వం రాజధాని రైతులకు కేటాయించిన ప్లాట్లను ఇతరులకు కేటాయించడమేనా జగన్ దూరదృష్టి చర్య? రాజధాని ప్రాంత మహిళల్ని వేశ్యలతో పోల్చిన సంస్కార హీనులు.. నేడు అమరావతికి అనుకూలమంటూ సన్నాయి నొక్కులు నొక్కడం సిగ్గుచేటు. అవినీతి, అధికారం, దోపిడీ, ధన దాహాలపై తప్ప, మరే అంశంపైనా జగన్ కు స్పష్టత లేదనే నిజం ప్రజలు గ్రహించాలి. అమరావతి నిర్మాణ ఖ్యాతిని తనదిగా చెప్పుకునేందుకే మాజీసీఎం ‘జగన్నా’టకాలు మొదలెట్టాడు.” అని మాజీమంత్రి ప్రత్తిపాటి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.


