Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 01: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం;

సంకల్పం దృఢంగా ఉంటే ఏ పనిలో అయినా విజయం సాధించవచ్చని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వన్నెల్ సత్యకుమారి అన్నారు. స్థానిక పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మోటివేషనల్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనం మైండ్‌కు బానిసలు కాకుండా, మైండ్‌ను మన ఆధీనంలోకి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. సాధారణంగా మనసులోకి వచ్చే నెగెటివ్ ఆలోచనలను పట్టించుకోకుండా, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని తెలిపారు. మాటలు, ఆలోచనలు, ప్రవర్తన అన్నీ సానుకూలంగా మార్చుకుంటే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.గణితం వంటి క్లిష్టమైన విషయాలను భయపడకూడదని, ఏ సబ్జెక్ట్ అయినా నేర్చుకోవచ్చనే నమ్మకంపెంపొందించుకోవాలని సూచించారు. సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే విజయాన్నిసులభంగా సాధించవచ్చని తెలిపారు.అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి మాట్లాడుతూ విద్యార్థులలో క్రమశిక్షణ ఎంతో అవసరమని అన్నారు. పనులను వాయిదా వేయకుండా సమయానికి పూర్తి చేస్తే విజయంవరిస్తుందని తెలిపారు. కార్యక్రమం అనంతరం సత్యకుమారిని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మునిరుద్దీన్ ప్రసాద్, రాజశేఖర్, ఎస్. శ్రీనివాస్, విజయ్, రాజేందర్, రాజనర్సయ్య, గంగాధర్, ప్రవీణ్ శర్మ, జ్యోతి, కే. శ్రీనివాస్, ట్వింకిల్ కుమార్, నరేష్, గంగా మోహన్, కోమలి, రిషిక, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.