జనం న్యూస్ ఏప్రిల్ 1 ముమ్మిడివరం ప్రతినిధి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం కే జగన్నాధపురం గ్రామంలో వికసిత్ భారత్ జి రాంజీ పథకం ఈ సంవత్సరం లో ప్రారంభోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ మేడిశెట్టి ఉషారాణి మరియు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు ప్రారంభించినారు పలువురు మాట్లాడుతూ ఉపాధి హామీ శ్రామికులు ప్లాస్టిక్ బాటిల్స్ కాకుండా స్టీల్ వాటర్ బాటిల్స్ ఉపయోగించాలని అలాగే వేసవికాలంలోతగు జాగ్రత్త తీసుకోవాలని మీ వలన గ్రామానికి మీరు పనిచేసే సంవత్సరం లో వర్క్ నుపట్టి అందులో 40 పర్సెంట్ అమౌంటు మన గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు యనమల వెంకటరమణ ఫీల్డ్ అసిస్టెంట్ మట్టపర్తి వెంకటరమణ మేట్స్ ఉపాధి శ్రామికులు పలువురు పాల్గొన్నారు


