Listen to this article

జనంన్యూస్. 02.నిజామాబాద్ రూరల్.శ్రీనివాస్ పటేల్.

ధర్పల్లి మండలంలోని ప్రాజెక్ట్ రామడుగు గ్రామంలో దేవాదాయ శాఖ ద్వారా 30 లక్షల వ్యయంతో నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి,ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వచనాలు స్వీకరించారు.అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని,ఆ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సీలు గ్రామస్తుల పై, నియోజకవర్గ ప్రజల పై ఉండాలని ఆకాంక్షించారు.గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.