జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 2 సెల్ 9550978955
చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గురువారం పౌర్ణమి పురస్కరించుకొని ఉదయం నుంచి ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు జరిగినాయి, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబాకు ప్రత్యేక హారతులు సమర్పించారు అనంతరం కొప్పర్రు బాల సాయి వెంకటేష్ ఆర్థిక సహకారంతో భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ కృష్ణవేణి, మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ సుబ్బారావు పాల్గొని బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ట్రస్టు సభ్యులు ఆయనకి చిరు సత్కారం కావించి సాయి తత్వ ప్రచార కార్యక్రమంలో భాగంగా సాయి సచ్చరిత్ర దత్తాత్రేయ స్వామి వారి పఠమును అందజేశారు, అనంతరం ఆయన మాట్లాడుతూ జయ జయ సాయి ట్రస్ట్ సేవలు అభినందనీయమని, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచి విషయం అని దీర్ఘకాలంగా 15 సంవత్సరములుగా మన సంతర్పణ చేయటం బాబా ఆశీస్సులతో మరి పట్టణాల్లో ప్రజల సహాయ సహకారాలతో చేయటం చాలా గొప్పదనం అని తెలియజేశారు, ఫస్ట్ ప్రెసిడెంట్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ భక్తుల సహకారంతో దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నామని సహకరించే దాతలు కూడా ఆయురారోగ్య భోగ భాగ్యంలతో తులతూగాలని, శ్రీ దత్త సాయిని ప్రార్థిస్తున్నామని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో పట్టణ పుర ప్రముఖులు కొత్తూరు హనుమంతరావు అయినవోలు హనుమంతరావు మద్దుల ప్రసాదు అధికార పార్టీ నాయకులు పోతురాజు తదితరులు పాల్గొన్నారు


