Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి13 మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రతి నిధి యల్ సంగమేశ్వర్. పాపన్నపేట్ మండల కేంద్రంలో ని కొత్తపల్లి గ్రామానికి చెందిన కీ. శే. శేరి రాజేందర్ – పద్మ కూతురు సాయి ప్రియ వివాహానికి గ్రామ ప్రజల ఆశీర్వాదంతో గ్రామ తాజా మాజీ సర్పంచ్ కుమ్మరి జగన్నాథం వధువుకు పుస్తె మట్టెలు అందజేశారు. ఈసందర్భంగా జగన్నాథం మాట్లాడుతూ ప్రజా సేవ చేయడం సంతృప్తిని ఇస్తుంది అని ప్రజా సేవే నా లక్ష్యం అని సమాజ సేవ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మనం ఎంత సంపాదిస్తే ఏముంది మన అనుకున్న వారికి సహాయం చేయలేనపుడు ఆ సంపాదన వ్యర్థం . మన మంచితనమే మనల్ని రక్షిస్తుంది అని అన్నారు. పుస్తే మట్టెలు అందజేసినందుకు గాను కుటుంబ సభ్యులు, బందువులు కృతజ్ఞతలతో హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దుర్గదాస్, మాజీ ముదిరాజ్ అధ్యక్షులు టప్ప భూమేష్, BRS గ్రామ పార్టీ అధ్యక్షులు సాయిరి రామకృష్ణ, గ్రామ మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కుర్మ యాదగిరి వార్డ్ సభ్యులు గడ్డం రాజు, మద్దెల భూమేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.