Listen to this article

జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలం

లోని అన్ని గ్రామాలలో గ్రామ సభలు విజయవంతంగా నిర్వహించారు. గ్రామ సర్పంచులు గ్రామ సభను నిర్వహించారు. గ్రామ సెక్రటరీ , రెవెన్యూ అధికారులు, స్పెషల్ ఆఫీసర్ సమక్షం లో గ్రామసభలో గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలు మీద చర్చ జరిగింది.తాగునీటి సమస్య, పారిశుద్ధం, రహదారులు అబివృద్ధి,వీధిదీపాలు ఏర్పాటు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల లాంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. పింఛన్లు,రేషన్, ప్రభుత్వ పథకాలు అమలు,రైతులకి సంబంధించిన సమస్యలు, పాఠశాల ల అబివృద్ధి అంశాలు పై చర్చించారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి సమస్యల పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నామని సర్పంచులు తెలిపారు. గ్రామ ప్రజల సమస్యలు, అభిప్రాయాల స్వీకరించి, సమస్యలు పరిష్కారణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల అధికారులు గ్రామ సర్పంచ్ లు, గ్రామ సెక్రటరీ లు, రెవెన్యూ అధికారులు,స్పెషల్ ఆఫీసర్ లు, ప్రధానోపాధ్యాయులు, ఆశావర్కర్లు, వార్డు మెంబర్లు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.