Listen to this article

జనం న్యూస్, ఏప్రిల్ 03,అచ్యుతాపురం :

అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం దోసూరు పంచాయతీ రావిపాలెం గ్రామంలో వెంచేసియున్న కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి అమ్మల గన్న అమ్మ దుర్గమాంబ అమ్మవారి
జాతరను ఈనెల 9 గురువారం నాడు ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వహించనున్నారు.
దుర్గమాంబ అమ్మవారి జాతర వాల్ పోస్టర్ ను ఎలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.