సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జహీరాబాద్, ఏప్రిల్ 2:
హనుమాన్ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నాడు జహీరాబాద్ పట్టణ లోని పలు ఆంజనేయ స్వామి ఆలయాల్లో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గురువారం ఉదయం నుండే ఆలయాలలో సందడి నెలకొంది. పట్టణం లోని పంచముఖి హనుమాన్ మందిరంలో ధ్వజ స్తంభ ప్రతిష్టపన, అభిషేకం, హోమం కార్యక్రమాలు నిర్వహించగా, హౌసింగ్ బోర్డు, బ్యాంకు కాలనీ, శాంతి నగర్, హమాలీ కాలనీ, గడి మొహల్లా, మాణిక్ ప్రభు వీధి లోని హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజ కార్యక్రమాలు, అన్నదానం జరిపారు. ఇదే క్రమంలో మార్వాడి హనుమాన్ మందిరం లో ఉదయం హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో కీర్తనలు, మహేశ్వరి సమాజ్ మహిళలు, ఏకాదశి భజన మండలి ఆధ్వర్యంలో రస రమ్యకర భజనలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు లస్సి ప్రసాదాన్ని అందజేశారు.



