Listen to this article

నేను మీకు అండగా ఉన్నాను” అని భరోసాఇచ్చే నాయకుడు

జనం న్యూస్, ఏప్రిల్ 03: నిజామాబాద్ జిల్లా

ఏర్గట్ల మండల కేంద్రంలో శుక్రవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పలు బాధిత కుటుంబాలనుపరామర్శించారు.గ్రామ శాఖ అధ్యక్షుడు దేవుడు నర్సయ్య అనారోగ్యంతో ఉండటంతో ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు. అలాగే నిమ్మన గంగయ్య తల్లి ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు ఏనుగందులరాజాపూర్ణనందంమాజీ ఎంపీటీసీ జక్కని మధుసూదన్, మాజీ సొసైటీ చైర్మన్‌ నర్సయ్యతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.