Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.

నందలూరు: మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామ పంచా యతీ అరవపల్లి ప్లే గ్రౌండ్ వద్ద సీతారాము లదేవస్థానంనందు శ్రీరామ నవమి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం సీతారాముల కళ్యాణాన్ని అర్చకులు సరస రవికుమార్ శర్మ కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణా నికి ముఖ్య అతి థులుగా ఎంపీపీ మేడ విజయ భాస్కర్ రెడ్డి,రాజంపేట వైఎస్ ఆర్సిపి ఇంచార్జ్ ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి లు పాల్గొని ప్రత్యేక పూజ లునిర్వహించారు. అనం తరం వైఎస్ఆర్సిపి మహిళా మండలి అధ్యక్షురాలు పల్లె మాధవి, మండల కో ఆప్షన్ సభ్యులు కరీముల్లా ఖాన్ నుఘనంగా సన్మానిం చారు. ఈ నేపథ్యంలో సీతారాముల ఉత్సవ మూర్తుల ను వేదికపై అత్యంత సుందరంగా ముస్తాబు చేసి ఆసీనులు గావించారు.భక్తులరామనామ స్మరణల నడుమ కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం జనాబ్ ఎస్టి ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ మరియు మండల మహిళా అధ్యక్షు రాలు పల్లె మాధవి సంయుక్తం గా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్య క్రమంలో అరిగెల సౌమిత్రి చంద్రనాథ్, గుండు మల్లి కార్జున రెడ్డి, నరసింహారెడ్డి, ఎముక ,దుర్గయ్య,విజయుడుతదితరులు పాల్గొన్నారు.