సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్ 4. 04. 2026
జహీరాబాద్, ఏప్రిల్ 3:(ఆంధ్రజ్యోతి) జహీరాబాద్ పట్టణంలోని 15, 16, 17 వార్డులలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎండి యూనూస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వార్డు సభల్లో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ప్రజల ముంగిటకే పాలనను తీసుకువచ్చి, వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఆయా వార్డుల్లోని కాలనీలలో పర్యటించి, స్థానికంగా నెలకొన్న తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని, వార్డుల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, వార్డు ప్రజలు మహిళలు పాల్గొని తమ వినతులను చైర్మన్‌కు అందజేశారు.


