Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 04-04-2026

కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలం పరిధిలోని నాగిరెడ్డిపల్లె మేజర్ పంచాయతీకి చెందిన కుమ్మరపల్లి, గొల్లపల్లి, అరవపల్లె, తోటపాలెం గ్రామాలలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమాలలో రాజంపేట జనసేన పార్టీ నాయకులు, మాజీ జడ్పిటిసి సభ్యులు యల్లటూరు శివరామరాజు గారు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్,పాల్గొన్నారు.అరవపల్లె తోటపాలెం గ్రామంలో శ్రీ సీతారాముల గ్రామోత్సవానికి యల్లటూరు శివరామరాజు, సమ్మెట శివప్రసాద్ ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్య క్రమంలో తోట శివ శంకర్, సూరి తదితర గ్రామ ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులుకుమార్, మధు, రాము, అంజి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.