Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

కార్మిక, వ్యవసాయ శాఖ మంత్రిగా దేశ ఉప ప్రధానిగా ఆయన సేవలు చిరస్మరణీయం…

జగ్జీవన్ రామ్ బాటలో పయనించడం మన కర్తవ్యం…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం

కాట్రేనికోన మండలంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు.)…

పేదరికంలో పుట్టి, స్వాతంత్ర సమరంలో పాల్గొని, రాజ్యాంగ రచనా సభ్యునిగా, దేశ ఉపప్రధానిగా మన దేశానికి సేవలందించిన మహనీయుడు బాబూ జగ్జీవన్ రామ్ అని, ఆయన బాటలో పయనించడం మనందరి కర్తవ్యమని ముమ్మిడివరం నియోజవర్గ ఎమ్మెల్యే &ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా చెయ్యరు &ఉప్పు చెరువులో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బాబు జగ్జీవన్ రామ్ ఆ జీవన పర్యంతం పాటు పడ్డారని కొనియాడారు. సపాయి కార్మికుల సంక్షేమం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి పని చేసిన వ్యక్తి జగ్జీవన్ రామ్ అన్నారు. 50 సంవత్సరాల పాటు పార్లమెంట్ సభ్యునిగా పనిచేసి రికార్డు సృష్టించారన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఏర్పడిన తొలి మంత్రివర్గంలో అతి చిన్న వయస్సులో కార్మిక శాఖామంత్రి గా పనిచేసిన ఘనత బాబు జగ్జీవన్ రామ్ ది అన్నారు. ఆయన హయాంలో కార్మిక అనుకూల చట్టాలు తెచ్చి కార్మికులకు ఎంతగానో మేలు చేశారని తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో కరువు వచ్చి అందరూ ఆకలి బాధలతో ఉండడం గమనించి హరిత విప్లవానికి నాంది పలికి భారతదేశానికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. తృటిలో ప్రధానిగా అవకాశం కోల్పోయారని, భారతదేశ ఉప ప్రధానిగా గొప్ప గొప్ప నాయకులతో కలిసి దేశానికి సేవ చేశారన్నారు. రాజ్యాంగ పరిషత్తు సభ్యునిగా ఉంటూ గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించడంలో బాబూ జగ్జీవన్ రామ్ తనదైన శైలిలో కృషి చేశారని కీర్తించారు. బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ చూపించిన మార్గం నేడు భారతదేశాన్ని శ్రీరామ రక్షలా ముందుండి నడిపిస్తుందన్నారు.ప్రజల కోసం ప్రజలే తమ నాయకుల్ని ఎన్నుకునేలా ప్రజాస్వామ్య విధానాలను, శాసన,కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలను ఏర్పాటు చేశారని ఇందులో జగ్జీవన్ రామ్ సైతం కీలక పాత్ర పోషించారన్నారు. అట్టడుగు వర్గాలు,పేద వర్గాలు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలని వారు కోరుకున్నారని, అవన్నీ నేడు సాకారమవుతున్నాయన్నారు. వర్గీకరణతో అణగారిన వర్గాల్లో పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. అందరూ బాగుండాలని ఆనాడు ఆ మహానుభావులు సంకల్పించారని, దాన్ని నేడు ప్రధాని నరేంద్ర మోడీ,ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల మార్గదర్శకత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందరి అభివృద్ధి కోసం, ప్రధానంగా అట్టడుగున ఉన్న వర్గాల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి ముందుకు వెళ్తున్నాయన్నారు. ఎన్డీఏ కూటమి నేతలుగా తామంతా బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కంకణ బద్ధులమై ఉన్నామన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. .ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తులు సాయి కాట్రేనికోన మండల టిడిపి అధ్యక్షులు చెల్లి సురేష్, నడింపల్లి సుబ్బరాజు, తవటపల్లి నాగేంద్ర (నాగు) ఎంపీటీసీ గుత్తుల సూర్య మహాలక్ష్మి ,జనసేన నాయకులు సీఎం, బలరాం , గిడ్డి చంటి బాబు, జి శ్రీనివాస్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.