సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్. 05. 04. 2026
ఈస్టర్ పండుగ పురస్కరించుకుని ఈ రోజు పస్తాపూర్ గ్రామంలోని ఈస్టర్ గుట్టలో జరిగిన క్రీస్తు ఆరాధన కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారు పాల్గొని అందరికి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియ జేశారు,ఈ సందర్భంగా వై.నరోత్తం గారు మాట్లా డుతూ గత 40 రోజులు శ్రమ దినాలు పూర్తి చేసుకొని మొన్న శుక్రవారం రోజు గుడ్ ఫ్రైడే జరుపుకుని శనివారం రోజు రన్ ఫర్ జీసస్ పెద్దగా జరుపుకుని ఈ రోజు ఈస్టర్ పండుగ జరుపుకోవడం శుభ శుచికం,ఈస్టర్ పండుగ అంటేనే పునరజ్జివానికి నిదర్శనం,ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన మానవాళి కొరకు ఉన్నాడని, ఎన్ని కష్టాలొచ్చిన ఆశను కోల్పోకుండా ముందుకు సాగాలని ఈ పండుగ మనకు సందేశమిస్తుంది,ఆయన ఇచ్చిన సందేశం శాంతి, సమాధానం,ప్రేమతో నడుచుకోవాలని కోరుతూ అందరికి ఈస్టర్ శుభా కాంక్షలు,ఈ కార్యక్రమం పాస్టర్ మోజేస్ ఆధ్వర్యంలో జరిగింది,ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీధర్ రెడ్డి,స్వప్న ప్రవీణ్,వై.తరుణ్ సంగీత జయరాజ్,సురేష్,అశోక్, నర్సింలు,శ్రీధర్,రాములు,మశ్చoదర్,క్రైస్తవ సోదర సోదరీ మణులు పాల్గొన్నారు



