జనం న్యూస్:6 ఏప్రిల్ సోమవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్;
లలితా చంద్రమౌలీశ్వర క్షేత్రం మిట్టపల్లి నందు శతావధాన శరచ్ఛంద్ర డాక్టర్ తాతా సందీప్ శర్మ గారిచే శతావధానం జరిగింది. కవి, పండితులు ఆచార్య దోర్బల ప్రభాకరశర్మ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో అవధాన ప్రక్రియ గొప్పదని, ధారణశక్తితో అవధానం అజరామరమన్నారు. సందీప్ శర్మ పృచ్ఛకులు అడిగిన పశ్నలకు అలవోకగా పద్యాలను అందించి, ధారణ చేశారు. క్షేత్ర నిర్వాహకులు పండరి రాధాకృష్ణ, ఉండ్రాళ్ళ రాజేశం, కాల్వ రాజయ్య, బోగయగారి చంద్రశేఖరశర్మ, మురళీధరశర్మ, అశోక్, రాజశేఖరశర్మ, విట్టుబాబు, శ్రీదేవి, శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.


