జనంన్యూస్. 06.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రురల్ సిరికొండ మండలం గడుకోల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది..కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, గృహ ప్రవేశ కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలను అందించరు ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతో ఉపయోగకరమని, ప్రతి అర్హత కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించడమే లక్ష్యమని తెలిపారు.కార్యక్రమంలో గడ్కోల్ సర్పంచ్ సండ్ర లత శంకర్,ఉప సర్పంచ్ రొక్కం సంపత్ రెడ్డి, కొండాపూర్ గ్రామ సర్పంచ్ నిరేటి మానస శ్రీధర్, యువ నాయకుడు కిషోర్ గౌడ్, గడ్కోల్ గ్రామ వార్డ్ నెంబర్లు పాప గంగారెడ్డి, తలారి హేమంత్, కొమ్మటి గంగాధర్, గొల్ల లింబయ్య, కలిగోట నర్సారెడ్డి ,కామారెడ్డి సంతోష్, లింగంపల్లి పోచయ్య, తలారి శ్రీనివాస్, కొండాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల బుచ్చన్న, సర్పంచ్ తండా సర్పంచ్ శోభా జీవన్ నాయక్, కాంగ్రెస్ సీనియర్ పార్టీ నాయకులు గౌస్ , అగుల జగన్, ఇషాక్, సామెల్ ,తదితరులు పాల్గొన్నారు.


