Listen to this article

వై. గీత మహేందర్ వికారాబాద్.

జగన్ న్యూస్ 6 ఏప్రిల్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి

ఈ దేశం లొ సామాజిక, ఆర్ధిక, అసమానతల నుండి మానవ అభివృద్ధి సాధించడం లొ BJR తన జీవితం మొత్తం కృషి చేశారు.విద్యార్థి దశ లోనే పాఠశాలలో విద్యార్థుల తాగునీటి కోసం కుండలు వెనుకబడిన వర్గలమీద వివక్ష తో అంటారని వారికోసం అని అణగారిన వర్గల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుండను బాద్దలు కొట్టి BJR తన తిరుగుబాటు నిరసన తెలియజేశారు. జనాభా కు సరిపడా ఆహార ధాన్యాల కొరత ఉండి ఆహార ధాన్యం సరిగ్గా అందుబాటులో లేనప్పుడు హరిత విప్లవం తో వ్యవసాయ సంస్కరణలు తీసుకురావడం జరిగింది.
ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే ఎస్సీ, ఎస్టీ వర్గాల ఉద్యోగుల ఉన్నతి కోసం వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు చేయడం జరిగింది. ఈ దేశం మొదటి కార్మిక శాఖ మంత్రిగా BJR ఉన్నపుడు ప్రధానంగా కార్మిక వర్గం లొ సామాజికంగా వెనుకబడిన వర్గాలే ఉన్నారని ప్రధానంగా కార్మిక వర్గం అభివృద్ధి కోసం
1 కనీస వేతన చట్టం 2 ఈఎస్ఐ చట్టం 3 ప్రావిడెంట్ ఫండ్ చట్టం 4 పారిశ్రామిక వివాదాల చట్టం
5 ట్రేడ్ యూనియన్ చట్టం ఇలాంటి కార్మిక వర్గానికి దోహదపడే చట్టాలను తేవడంలో BJR గారి కృషి మరువలేనిది ఈ చాటాలని కార్మిక వర్గానికి రక్షణ కవచంగా ఉన్నాయి. మహనీయుల కృషితో అనేక ప్రజా పోరాటాలతో ఏర్పడినటువంటి కార్మిక చట్టాలను కుదిస్తూ నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చి కార్పోరేట్లకు ఊడిగం చేస్తున్నాఇ నేటి కార్పొరేట్ ప్రభుత్వాలు ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇస్తూ ప్రభుత్వ ఆస్తులను దార దత్తం చేస్తూ కార్పొరేట్ సంస్థల కోసం ఊడిగం చేస్తూ అణగారిన వర్గాలు, వెనుకబడిన వర్గాలు, కార్మిక వర్గాలను వారి హక్కుల కోసం మాట్లాడనీయకుండా నొక్కి వేస్తూ శ్రమ దోపిడీకి గురి చేస్తూ కనపడని రూపంలో వివక్షను కొనసాగిస్తూనే ఉన్నారు.కష్టజీవులు, కార్మికులు, పేదలు, బడుగు బలహీన వర్గాల యొక్క సామాజిక, రాజకీయ, ఆర్థిక అభివృద్ధి సాధించే దిశగా మహనీయుల స్ఫూర్తితో సామాజిక, ఆర్థిక, రాజకీయ వివక్షకు వ్యతిరేకంగా పోరాడుదాం! మహనీయుల ఆశయాలను సాధిద్దాం!!