జనం న్యూస్ ఏప్రిల్ 6 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
భారతీయ జనతా పార్టీ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్, భూదేవి హిల్స్ కాలనీలో బిజెపి యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్ బిజెపి జెండా ఆవిష్కరణ చేసి అనంతరం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా కుమార్ యాదవ్ మాట్లాడుతూ బిజెపి పార్టీలో కార్యకర్తల త్యాగాలు చాలా గొప్పవి అన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఏండ్ల తరబడి పార్టీ కోసం పార్టీ ఎదుగుదల కోసం కృషి చేస్తున్నారు అన్నారు. అనునిత్యం బిజెపి కార్యకర్తలు దేశం పట్ల, ధర్మం పట్ల చిత్తశుద్ధితో ఉండి దేశానికి ధర్మానికి ఎక్కడ ఆపద వచ్చిన ముందు వరుసలో నిలబడి కాపాడుకుంటారన్నారు. అందుకే ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులవుతారని అన్నారు. తెలంగాణలో కూడా పార్టీ విస్తరణ రోజు రోజుకి పెరుగుతుంది అన్నారు. రానున్న హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలోభారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అందులో ఆల్విన్ కాలనీ డివిజన్ కూడా ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు రవీందర్ రావు నరేందర్ రెడ్డి రామరాజు దుర్గ ప్రసాద్ మహేందర్ పున్నారెడ్డి, ఎత్తరి రమేష్, తిరునగరి శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, రజనీష్, శేఖర్, నరసింహ శైలేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు,


