జనం న్యూస్ ఏప్రిల్ 6 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన
కాట్రేనికోన మండల పరిధిలో గెద్దనపల్లి పంచాయతీ శివారు చింతల మెరకలో వేంచేసి యున్న శ్రీ విజయలక్ష్మి దుర్గ అమ్మ వారికి వనచర్ల వెంకట రెడ్డి(మాస్టర్) కుమార్తె హైదరాబాద్ కు చెందిన అప్పారి సత్యనారాయణ,శ్రీలక్ష్మీ కుమార్తె నవీన, అర్జున్ కుటుంబ సభ్యులు ఒక లక్ష రూపాయలను బహుకరించారు.
ఆలయం పురోహితులు ఆకొండి శ్రీకాంత్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వనచర్ల బాలాజీ, కముజు లక్ష్మీ రమణారావు,దొమ్మేటి బాబ్జి,సంసాని గంగాధర్,విత్తనాల పండు,మోహన్ రావు, వనచర్ల సూర్య పవన్, దుర్గాప్రసాద్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు


