Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 6 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ

బిజెపి కొత్తపేట మండల అధ్యక్షుడు సంపతి కనకేశ్వరరావు ఆధ్వర్యంలో బిజెపి 46 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం విచ్చేశారు. నాయకులు ముందుగా స్థానిక బోడి పాలెం వంతెన సెంటర్ వద్ద బిజెపి పార్టీ జెండా ఎగురవేసి వందన సమర్పణ చేశారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పాలూరి మాట్లాడుతూ దేశసేవ,దేశాభివృద్ధే ధ్యేయంగా, ప్రజాసేవే లక్ష్యంగా ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ….నేడు కోట్లాది భారతీయుల ఆశయాలకు ప్రతిబింబంగా నిలిచిందనీ
సిద్ధాంతం – సేవ – సమర్పణ అనే మార్గదర్శకాలతో ముందుకు సాగుతూ, వాజపేయి,అద్వానీ, నరేంద్ర మోడీలాంటి నాయకులతో పాటూ ఇంకా అనేక మంది కార్యకర్తలు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి పార్టీ సిద్ధాంతాలను పాటిస్తూ కృషి చేస్తున్నారన్నారు.”సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్” అనే మహత్తర సంకల్పంతో,గ్రామం నుంచి దేశం వరకు ప్రతి భారతీయుడి జీవితంలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో అభివృద్ధి, పారదర్శకత, సుస్థిరతకు కట్టుబడి పనిచేస్తున్న పార్టీ బిజెపి అనీ,నేడు భారతీయ జనతా పార్టీ 46వ వ్యవస్థాపక దినోత్సవం.ఈ సందర్భంగా పార్టీ స్థాపకులు, నాయకులకు.అహర్నిశలు శ్రమిస్తున్న ప్రతి కార్యకర్తకు హృదయ పూర్వకంగా ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గొలకోటి వెంకటేశ్వరరావు, బిజెపి యువమోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి పాలూరి జయప్రకాష్ నారాయణ,బిజెపి సీనియర్ నాయకులు కోటిపల్లి సుబ్రహ్మణ్యం, మండల ఉపాధ్యక్షుడు సబ్బవరపు సత్యనారాయణ, కముజు శివ , అన్యం సత్యనారాయణ, కిసాన్ మోర్చ నాయకులు ఉద్దరాజు ప్రసాదరాజు,కోటిపల్లి దామోదర్, యువమోర్చ మండల అధ్యక్షుడు వలపశెట్టి కిరణ్, మైనారిటీ మోర్చ మండల అధ్యక్షుడు అజ్జరపు సత్యనారాయణ, ముఖేష్ మరియు నాయకులు అభిమానులు పాల్గొన్నారు..