జనంన్యూస్. 06.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు 37వ డివిజన్లో గోరోల్ల గంగామణి కి ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు, డిసిసి కార్పొరేషన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించబడింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, పేద ప్రజలకు గృహవసతి కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇలాంటి పథకాల ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు అందేలా కృషి కొనసాగుతుందని తెలిపారు. గోరోల్ల గంగామణి కి శుభాకాంక్షలు తెలియజేసి, ఆమె కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో 37వ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ టెంట్ హౌస్ శ్రీనివాస్. 39వ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ చక్రి దౌలత్. సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజ్ గగన్ , జనరల్ సెక్రటరీ శంకర్ , కార్యనిర్వాహక సభ్యులు బసవ సాయి సన్నీ గౌడ్ తదితరులు పాల్గొని తమ మద్దతును తెలిపారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.



