జనం న్యూస్ 07 ఏప్రిల్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి
వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం గట్టుపల్లి గ్రామంలో సర్పంచ్ పద్మ-రాజు ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా గ్రామంలో అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సర్పంచ్ పద్మారాజు మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు పారిశుధ్య సౌకర్యాలు మెరుగుపరచడం, వర్షపు నీరు మరియు మురుగు నీరు నిల్వ కాకుండా సకాలంలో బయటకు వెళ్లే విధంగా ఈ అండర్ డ్రైనేజీ పనులు చేపట్టామని, గ్రామంలోని కావలి కిష్టయ్య ఇంటి నుండి శెనిగెరి రాములు ఇంటి వరకు డ్రైనేజీ లైన్ల నిర్మాణం జరుగుతుంది. ఈ పనులు పూర్తయిన అనంతరం గ్రామంలో పరిశుభ్రత పెరగడంతో పాటు దోమల వ్యాప్తి మరియు అనారోగ్య సమస్యలు తగ్గే అవకాశం ఉందని సర్పంచ్ పద్మ-రాజు అన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో విలేజ్ సెక్రెటరీ అబ్దుల్లా, వార్డ్ నెంబర్లు, కరోబర్ కే రవి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


