Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 14 : జమ్మికుంట కుమార్ యాదవ్ : జమ్మికుంట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వావిలాల పరిధిలోని జమ్మికుంట-2 ఆరోగ్య ఉప కేంద్రాన్ని రాష్ట్ర ప్రజా ఆరోగ్య సంచాలకులు డా . రవీంద్ర నాయక్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.వెంకటరమణ ఆకస్మిక తనిఖీ చేసారు . గర్భిణీల కు, చిన్న పిల్లలకు మహిళలకు అందుచున్న సేవలు మరియు వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరు పరిశీలించి,వైద్య సిబ్బంది పని తీరును ప్రశంసించారు. ఆరోగ్య కేంద్రానికి సంబందించిన వివిధ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆరోగ్య సేవల కోసం వచ్చే వారికి ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడాని కి పలు సలహా సూచనలు వైద్య సిబ్బందికి తెలియజేసినారు. అన్ని జాతీయ ఆరోగ్య కార్య క్రమాలపై విస్తృతంగా ప్రచారం చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలియ జేసినారు. అనం తరం వైద్య సిబ్బంది ప్రజా ఆరోగ్య సంచాలకులు డా.రవీందర్ నాయక్ ని బోకే మరియు శాలువాతో ఘనంగా సత్కరించినారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డా.రవీంద్ర నాయక్, వెంకటరమణ తో పాటు డిఎంహెచ్ఓ డా.చందునాయక్ , ఞ్చమ్ డీపీవో స్వామి, వావిలాల మెడికల్ ఆఫీసర్ డా.రాజేష్, మహోన్నత పటేల్, సిహెచ్ఓ శ్యామ్, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, సూపర్వైజర్ అరుణ, ఏఎన్ఎం మంజుల,రజిత మరియు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు