Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 8 అమలాపురం

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడటం గర్హనీయమని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( ఏపీ యు డబ్ల్యూజే) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు ఎం.ఎన్.వి. ప్రసాద్ (మండేల బాబీ) ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్రికా స్వేచ్ఛను హరించేలా మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదని ఆవేదన వ్యక్తం చేశారు. వార్తా కథనాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే చట్టపరమైన మార్గాల్లో వెళ్లాలి తప్ప, ఇలా భౌతిక దాడులకు దిగడం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు.​పత్రికా స్వేచ్ఛ: మీడియాపై దాడులు భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేయడమే.​చట్టపరమైన మార్గం: ఏవైనా విభేదాలు ఉంటే కోర్టులు లేదా ప్రెస్ కౌన్సిల్ ద్వారా పరిష్కరించుకోవాలి కానీ దాడులు చేయకూడదు.​రక్షణ: విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు తగిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.​రాజకీయ నాయకులు లేదా వారి అనుచరులు అభ్యంతరకర భాషలో దూషించడం, దాడులకు దిగడం తగదని ఎం.ఎన్.వి. ప్రసాద్ పేర్కొన్నారు. మీడియాపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.