Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 8 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

తెలుగుదేశం పార్టీ అభిమాని ఎన్టీఆర్ ఫ్యాన్ ఎన్టీఆర్ వ్యవసాయ మార్కెట్ కొలగార్ల సంఘం మాజీ అధ్యక్షులు దాడి బోగలింగం( కోటి) ఇటీవలే అకాల మరణం చెందారని, ఈరోజు ఉదయం గొలగం వారి స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన సంతాప సభకు మాజీ శాసన మండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు పాల్గొని కోటి చిత్రపటానికి పుష్పాలు సమర్పించి ఘనమైన నివాళులు అర్పించారు. కార్మికుల ఉద్దేశించి నాగ జగదీష్ మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం ఎనలేని కృషిచేసి వారి హక్కుల కోసం రాజీ లేని పోరాటం చేశారని నిరంతరం కార్మిక పక్షాన నిలిచి నాడు జరిగిన నల్లబెల్లం ఉద్యమంలో వీరోచితంగా పోరాడి ప్రభుత్వం ద్వారా సమస్యను పరిష్కారానికి కృషి చేశారని నాగ జగదీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో కొణతాల వెంకటరావు కాండ్రేగుల సత్యనారాయణ పొలిమేర నాయుడు కొణతాల కాశీ విశ్వనాథంతదితరులు పాల్గొన్నారు.