జనం న్యూస్- ఏప్రిల్ 8- నాగార్జునసాగర్ టౌన్-
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కన్జ్యూమర్స్ ఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ (సంఘమిత్ర స్టోర్స్) సభ్యులకు సంబంధించిన ఓటరు తుది జాబితా సిద్ధంగా ఉందని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకటయ్య ఒక ప్రకటనలో తెలిపారు. 31- 12- 2025 నాటికి అర్హులైన సభ్యుల యొక్క ఓటరు జాబితాను తయారుచేసి పెదవుర మండల రెవెన్యూ ఆఫీసు మరియు ఎంపీడీవో ఆఫీసు నందికొండ మున్సిపాలిటీ కార్యాలయము యందు, గ్రామ సచివాలయం రైట్ బ్యాంక్, మండల రెవెన్యూ ఆఫీసు మరియు ఎంపీడీవో ఆఫీసు మాచర్ల, సంఘమిత్ర కార్యాలయం హిల్ కాలనీ మరియు పైలాన్ కాలనీ నోటీసు బోర్డుల వద్ద సంఘ సభ్యుల పరిశీలనార్థం ఉంచినట్లుగా ఆయన తెలిపారు. ఇట్టి ఓటర్ల జాబితాను పరిశీలించి ఏమైనా అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉన్నచో సంఘమిత్ర స్టోర్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కి తేదీ 9 -4 -2026 సాయంత్రం 5 గంటల లోపు లిఖితపూర్వకంగా సమర్పించాలని కోరారు. గడువు ముగిసిన తర్వాత ఎటువంటి అభ్యంతరాలు స్వీకరించబడవని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలిపారు.


