Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 08-04-26

కడప జిల్లా, రాజంపేట మండలం, ఎం.జి.పురం ఇందిరమ్మ కాలనీలో నేడు బుధ వారం బూత్ అధ్యక్షులు పెంచ లయ్య ఆధ్వర్యం మరియు మండల అధ్యక్షులు జి. ప్రసాద్ రెడ్డి న్యాయకత్వంలో “మన ఊరు – మన జెండా” కార్యక్రమం విజయవంతంగా జరిగినది.ఈ కార్య క్రమానికి ముఖ్య అతి థులుగా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు లు హాజరై, పార్టీ బలోపేతానికి సంబంధించిన సూచనలు ఇచ్చారు.ఈ కార్య క్రమం లో జిల్లా ఉపాధ్యకులు కృష్ణ యాదవ్, జిల్లా కార్యదర్శి నరేంద్ర రాజు మరియు బీజేపీ కార్యకర్తలు కోటంరాజు, సుబ్బ రాజు, గడి నరసరాజు, లక్ష్మణ్ రాజు పాల్గొని కార్యక్రమాన్ని విజయ వంతం చేశారు.ఈ సందర్భంగా నాయకులు గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని,ప్రతి ఇంటికీ పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.