Listen to this article

జనం న్యూస్ నందిలూరు కడప జిల్లా 09-04-26

నందలూరు మండలంలోని గత రెండు వారాలుగా ఎండలు అధికంగా ఉండ డంతో ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లో అల్లాడుతు న్నారు.నందలూరు మండ లంలో ప్రజలందరూ అప్రమ త్తంగా ఉండాలి వడదెబ్బ పట్ల జాగ్రత్త వహించాలని ఎండలు మండిపోతున్న విషయంపై ప్రతి ఒక్కరికి వడదెబ్బ సోకేఅవకాశం ఉన్నందున పెరిగిన ఎండల బారి నుండి తప్పించుకుని ఆరోగ్య సంరక్షణ పట్ల దృష్టి సాధించాలని వేసవికాలం ముగిసేంతవరకు అత్య వసర పరిస్థితులలో బయటికి వెళ్లాలంటే గొడుగు వెంట తీసుకు వెళ్లాలని ఇలాంటి జాగ్ర త్తలు తీసుకుంటే వడదెబ్బ నుంచితప్పించుకోవచ్చని,డాక్టర్,తెలిపారు.వృద్ధులు ,చిన్నపిల్లలు అతి జాగ్రత్తగా ఉండా లని ఎండ తీవ్రంగా ఉన్నం దున సాధ్యమైనంత వరకు ఉదయం పూట పనులు ముగించుకోవాలని చల్లని మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లువాడుతూవడ దెబ్బ తగల కుండా ఆరోగ్యాన్ని కాపాడు కోవాలని డాక్టర్ తెలిపారు.