Listen to this article

జనం న్యూస్ 10 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల అధ్యక్షుడు పిడుగు వెంకటేష్ ఆధ్వర్యంలో పండిట్ దిన్ దయాళ్ ఉపాధ్యాయుల ప్రాశిక్షణ మహా అభియాన్ శిబిరంలో తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు హాజరై మాట్లాడుతూ.మహాభియాన్ యొక్క లక్ష్యం, ప్రశిక్షణ విధానం మరియు కార్యకర్తల పాత్ర మరియు పలు అంశాలపై ప్రసంగించడం జరిగింది. ప్రశిక్షణ యొక్క ఉద్దేశ్యం, ప్రశిక్షణ నమూనా, విషయ సూచిక, కార్యకర్తలకు అవసరమైన ఆలోచనా దృక్పథం, సంస్థ పట్ల నిబద్ధత, మరియు సమాజ సేవలో కార్యకర్తలకు బాధ్యతలు వివరించారూ.ఈ ప్రశిక్షణ కార్యకర్తలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు మరియు జాతీయతా భావాన్ని పెంపొందించే ఒక శక్తివంతమైన సాధనం. వ్యక్తి నిర్మాణం ద్వారానే సంస్థ బలోపేతం సాధ్యమవుతుంది, సంస్థ బలోపేతం ద్వారానే దేశ నిర్మాణం సాధ్యమవుతుంది అనే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకువెళ్లడం ప్రతి కార్యకర్త యొక్క ముఖ్య బాధ్యత. దేశభక్తి, సేవా భావం, మరియు సిద్ధాంతాల పట్ల అంకితభావంతో ప్రతి కార్యకర్త సమాజంలో మార్పుకు దారితీసే నాయకుడిగా ఎదిగి, సంస్థను మరింత బలోపేతం చేసి దేశ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు..ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో సాధించిన విజయాలు ఘనతలపై చారిత్రక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్,రామ మందిరం, స్టజికల్ స్ట్రైక్, ఆపరేషన్ సింధూర్, కరోనా వ్యాక్సిన్, ఉచిత బియ్యం, సిసి రోడ్, డ్రైనేజీలు, టాయిలెట్స్, అంగన్వాడికి ఇచ్చే నిధులు, ముద్ర లోన్స్, విశ్వకర్మ లోన్స్, రైతు వేదికలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, పీఎం కిసాన్, దేశ భద్రత విషయంలో రాజీలేని,పోరాటం అలాగే కేంద్రం ప్రభుత్వం చేసే పనిలో వివరించి పూర్తిగా ప్రజలకు తెలిపిన జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి లు రవికుమార్ ఎక్బోటే,కేకే రెడ్డి ,బిజెపి సీనియర్ నాయకులు మహేంద్ర ఉపేందర్ రెడ్డి సుంకన్న పృథ్వీరాజ్ సింగ్ వంశీధర్ రెడ్డి రంగస్వామి తదితరులు పాల్గొన్నారు