Listen to this article

కాపాడే వారే, కరువయ్యారు

జనం న్యూస్, 2026 ఏప్రిల్ 10, కొల్లూరు గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు )

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండల పరిధిలోని, కొల్లూరు గ్రామంలోని , గ్రామ కంఠంలో ఖాళీ స్థలం ఎక్కడ కనిపించినా, అది మంచినీటి బావుల వద్ద, చేతి పంపుల వద్ద, చెత్త కుండీల వద్ద, మందిరాల వద్ద, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద, గ్రామంలో ఖాళీ స్థలం ఎక్కడ కనిపించినా, దౌర్జన్యంగా, స్థలాలను ఆక్రమించుకొని , అక్రమంగా, గ్రామపంచాయతీ అనుమతులు లేకుండానే, కట్టడాలు నిర్మించుకొనుచున్నారు. సంబంధిత, ప్రభూత్వ అధికారులు స్పందించి, అక్రమంగా గ్రామ కంఠంలోని స్థలాలను కబ్జా చేసి, అందులో నిర్మాణాలు చేపడుతున్న, నివాసముంటున్న వారిని గుర్తించి, చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, గ్రామ ప్రజలు కోరుచున్నారు.