జనం న్యూస్, ఏప్రిల్ 11,అచ్యుతాపురం:
అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు పరవాడ డీఎస్పీ మోహన్ రావు ఆధ్వర్యంలో అచ్యుతాపురం సెజ్ పరిధిలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. నాయనమ్మ పాలెం, గురజాపాలెం,దిబ్బపాలెం పరిధిలో ఉన్న ఇళ్లను, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఎటువంటి మాదక ద్రవ్యాలు లభించలేదని,ఎటువంటి రికార్డులు లేని 16 మోటార్ సైకిల్ లు,ఒక ఆటోను గుర్తించి వాటిని స్టేషన్ కు తీసుకు రావడం జరిగిందని,అదేవిధంగా సెజ్ పరిధిలో విద్యా సంస్థలకు దగ్గరలో గుట్కాలు అమ్ముతున్నటువంటి ఒక షాప్ యజమానిపై కేసు నమోదు చేసి అతని వద్ద ఉన్న గుట్కా కైనాలను సీజ్ చేయడమైనదని పోలీసులు తెలిపారు.ఈ కార్యక్రమంలో అచ్యుతాపురం,ఎలమంచిలి సీఐలు,అచ్యుతాపురం ఎస్ఐలు,ఎలమంచిలి ట్రాఫిక్ ఎస్ఐ,పరవాడ మహిళా ఎస్సై మరియు పరవాడ సబ్ డివిజన్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


