Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 11-04-26

కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, రాజంపేట పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం (యల్లటూరు భవన్) నందు మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్య క్రమంలో రాజంపేట పార్ల మెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు స్థానిక నాయకులతో కలిసి మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి గౌరవప్రదంగా నివాళులు అర్పించారు.ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడు తూ, విద్యా సమానత్వం, స్త్రీ సాధికారత మరియు సామాజిక న్యాయం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన అహర్నిశల పోరాటం మనందరికీ ఆదర్శ ప్రాయ మని పేర్కొన్నారు.సమాజం లోఅసమానతలుతొలగించిసమాన హక్కులు కలిగిన సమాజనిర్మాణానికి చేసిన సేవలుచిరస్మరణీయమనిఅన్నారు.మహాత్మా జ్యోతి రావు పూలే జయంతిని రాష్ట్ర పండుగ గా నిర్వ హించడం ఆయన గొప్ప తనానికి నిదర్శన మని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు యల్ల టూరు శివరామ రాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, మావిళ్ళ రవి, పెడకాల సుధాకర్, పి.వి.ఆర్ కుమార్, వినోద్ వర్మ, ప్రతాప్, పిచ్చయ్య నాయుడు, శంకరరాజు, పూల లక్ష్మీనరసయ్య, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.