మహారాజుల సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులు
జనం న్యూస్- ఏప్రిల్ 11- నాగార్జునసాగర్ టౌన్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ మెయిన్ బజార్ ప్రొఫెసర్ జయశంకర్ భవన్ వద్ద మహారాజుల సేవా సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మ జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహారాజుల సేవా సంఘం సభ్యులు మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తి జ్యోతి రావు పూలే అని, ఆయన విద్య, సమానత్వం, మహిళా సాధికారత కోసం చేసిన సేవలు ఈ దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతాయని, ప్రతి ఒక్కరికి విద్య సమాజంలో ప్రతి వ్యక్తికి సమాన హక్కులు ఉండాలని ఆయన ఆశయాలు ప్రజలందరికీ మార్గదర్శకమని ఇప్పటికీ ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో ఉన్న అసమాన తలన తొలగించేందుకు మనం కృషి చేయాలి అని పేర్కొన్నారు.


