చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి,
జనం న్యూస్,ఏప్రిల్ 11,కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జ్యోతి రావు పూలే జయంతిని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పుష్పగుచ్చాలతో టెంకాయలు కొట్టి ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామ సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి,స్వాహస్తములచే చలివేండ్రని ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ సామాజిక సంస్కరణల చరిత్రలో ఈ రోజుకు ఎంతో విశిష్టత ఉంది.19వ శతాబ్దంలో సమాజంలోని మూఢనమ్మకాలు,కుల వివక్ష,మహిళా అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంస్కర్త జ్యోతిరావు ఫూలే,సామాజిక విప్లవకారుడు అని అన్నారు.1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలో జన్మించిన ఫూలే, దళితులు,అణగారిన వర్గాల,మహిళల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు.స్త్రీ విద్యకు అగ్రగామిగా మహిళా విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి,తన భార్య సావిత్రిబాయి ఫూలేతో కలిసి 1848లో పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించారు అని అన్నారు.సత్యశోధక్ సమాజ్: కుల రహిత సమాజం కోసం 1873 సెప్టెంబర్ 24న ‘సత్యశోధక్ సమాజ్’ సత్య అన్వేషకుల సంఘం స్థాపించి సామాజిక సమానత్వం కోసం పోరాటం చేశారు అని అన్నారు.పూలే రాసిన గులాంగిరి, షేత్కర్యాచా అసుద్,వంటి పుస్తకాలు సామాజిక అన్యాయాలను ఎండగట్టాయి అని అన్నారు.మహాత్మ బిరుదు ప్రజల కోసం ఆయన చేసిన నిస్వార్థ సేవలకు గుర్తింపుగా, 1888లో ప్రజలు ఆయనకు మహాత్మ అనే బిరుదును ప్రదానం చేశారు అని అన్నారు.ఆయన జయంతి రోజున,కుల వివక్ష లేని సమసమాజ స్థాపన కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకుంటారు అని అన్నారు.తెలంగాణ వంటి రాష్ట్రాల్లో పూలే జయంతిని అధికారికంగా నిర్వహించలని అని అన్నారు.మహిళా సాధికారత,సామాజిక న్యాయం కోసం ఫూలే చేసిన కృషి,నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం అని అన్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు గైనీ భూమయ్య,ఉప ఉపాధ్యక్షులు అంజి, కార్యదర్శి గైనీ జైపాల్, డేవిడ్,సాయిలు,మారుతీ,సంజీవ్,ప్రకాష్, శ్రీపతి,మచ్చేందర్, జగన్,లలిత,ప్రేమల, విటావా,లచ్చావా,బాలమణి,యువజన సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


