

జనం న్యూస్ తర్లుపాడు మండలం ఫిబ్రవరి 14: .మండల కేంద్రమైన తర్లుపాడు లో వెలసిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారి కళ్యాణ మహోత్సవం ఆలయ ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి మరియు ఆలయ అనువంశిక ధర్మకర్త జవ్వాజి విజయభాస్కర్ రావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10 గంటలకు కళ్యాణం ప్రారంభమైనది మాఘ మాసంలో మాఘ పౌర్ణమికి అంకురార్పణతో ప్రారంభమై మఖా నక్షత్రం రోజున రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారికి కళ్యాణం జరుగుతుంది ఈ కళ్యాణం రోజున ముందుగా గణపతి పూజ పుణ్యాహవాచనము నాంది దేవత ఆహ్వానం స్వామివారికి పట్టు వస్త్రములు కంకణ ధారణ మాంగల్య ధారణ అక్షతారూపణం కార్యక్రమం జరుగుతుంది ఈ స్వామివారి కల్యాణ ఉభయ దాతలుగా జవ్వాజి విజయభాస్కరరావు కుటుంబ సభ్యులు వ్యవహరిస్తారు స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కళ్యాణ మహోత్సవానికి తిలకించేందుకు గ్రామ పెద్దలు తర్లుపాడు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు స్వామి వారి కళ్యాణం తిలకించి స్వామివారి ప్రసాదం అన్నసంతర్పణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు స్వామివారి భక్త బృందము అధిక సంఖ్యలో పాల్గొన్నారు.