Listen to this article

జనం న్యూస్- ఏప్రిల్ 11- నాగార్జునసాగర్ టౌన్-

నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. పైలాన్ కాలనీ మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలు ప్రస్తుత సమాజానికి స్ఫూర్తిదాయకమని, మహిళ విద్య కోసం పునాదులు వేసిన గొప్ప సంస్కర్త అని కుల రహిత సమాజం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాన్నే అంకితం ఇచ్చిన మహా నాయకుడు అని కొనియాడారు. 8వ వార్డు గణేష్ మండపం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ నకిరేకంటి రమణ సైదులు మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హీరేకార్ రమేష్ జి, ఆదాసు విక్రమ్, సయ్యద్ మక్సూద్, మహమ్మద్ గని, విజయ్, రాజు, సైదారావు, కోడా విజయ్, కోదండ తదితరులు పాల్గొన్నారు.