జుక్కల్ ఏప్రిల్ 11 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలోని పడంపల్లి గ్రామానికి చెందిన రైతు దానేవార్ సంతోష్, గత ఏడాది ఎకరానికి 55 క్వింటాళ్ల మక్క పంట దిగుబడి సాధించాడు. కామారెడ్డి జిల్లా ఓ ప్రైవేట్ సీడ్ కంపెనీ అధికారులు నడిమ్పల్లి గ్రామ రైతును ఘనంగా సన్మానించారు. శనివారం పడంపల్లి గ్రామంలో సంతోష్ మక్క పంట పోలంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.రైతు సంతోష్ మాట్లాడుతూ, ఎన్ కే 7884 అనే రకం విత్తనం విత్తుకొని ఒక ఎకరానికి 55 క్వింటాళ్ల అత్యధిక మక్క దిగుబడి సాధించానని, శాలువాతో సన్మానించి ప్రశంసా పత్రంతో పాటు జ్ఞాపికను సీడ్ కంపెనీ వారు అందించారని తెలిపారు.ఈ సందర్భంగా సంతోష్ అన్నారు, గతేడాది ఎకరంన్నర భూమిలో మక్కపండిస్తే 85 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని చెప్పాడు. ఈ సంవత్సరం కూడా నాలుగు ఎకరాల మక్కా పంట పండిస్తున్నానని తెలిపారు మక్కా పంట ఎక్కువగా పెరిగింద ని .గత ఏడాది 55 క్వింటాలు దిగుబడి వస్తే ఈ ఏడాది 55 తుంటాల పైన దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాను.ఈ కార్యక్రమంలో పడంపల్లి గ్రామ సర్పంచ్ వాగ్ మారే విజయ్ కుమారి సంజు ఉప సర్పంచ్ ఫౌండే సవిత బస్వంత్. మాజీ సర్పంచ్ గంగాధర్ వాగ్మారే లక్ష్మణ్ జిల్లాకు సంబంధించిన ప్రైవేట్ సీడ్ కంపెనీ డీలర్లు అధికారులు రైతులు వీరభద్ర ఉమాకాంత్ మాలి పటేల్ చంద్రకాంత్ మాజీ సైనిక్ ఉద్యోగి కాశీనాథ్ స్వామి లక్సెట్టి మల్లికార్జున్ కే రాజు మొగిలాజి ఫుల్ రామ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు


