Listen to this article

పాఠశాల గేటు వద్ద కుటుంబ సభ్యులు,బంధువులు ఆందోళన

జనం న్యూస్, ఏప్రిల్ 11,అచ్యుతాపురం:

అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలో శనివారం విషాదం
చోటుచేసుకుంది. అచ్యుతాపురం కేజీబీవీలో 7వ తరగతి చదువుతున్న మైలపల్లి నవ్య (12) పాము కాటుకు
గురై మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. పాఠశాలలో బాలికను పాము కరవగా తొలుత అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తీసుకెళ్లి, అనంతరం విశాఖ కేజీహెచ్ కు తరలించారు.అక్కడ బాలిక
మృతిచెందిందన్నారు. మృతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు పాఠశాల గేటు వద్ద
ఆందోళన చేపట్టారు.ఈ సందర్బంగా సీఐటీయూ నాయకులు కె సోము నాయుడు మాట్లాడుతూ కేజీబీవి హాస్టల్ పై సంబంధిత అధికారులు పర్యవేక్షణ లేదని విద్యార్థిని మృతి ఫై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని అన్నారు