Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 13 చిలిపిచేడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామంలో సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది ప్రజాపాలన ప్రగతి నివేదిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలో ఏటేటా వాహనాల సంఖ్య ని వేగంగా పెరుగుతుంది మెరుగైన రహదారులు ఉన్నప్పటికీ సరైన డ్రైవింగ్ శిక్షణ లోపించడం అతివేగం నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరగడం ఆందోళన కలిగిస్తుంది ప్రమాదాల నివారణకు స్థానిక అవసరాలకు అనుగుణమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల్లో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాటు ట్రాఫిక్ నియమాలపై అవగాహన రోడ్డు భద్రత కమిటీ సమావేశాలు నిర్వహిస్తూ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలి అరైవ్ లైవ్ లో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలి ప్రజల ప్రాణాలను కాపాడటమే ముఖ్య ఉద్దేశం చండూర్ గ్రామ సర్పంచ్ శేషాద్రి మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహన కాగితాలు వెంబడి ఉంచుకొని జాగ్రత్తగా ప్రయాణం చేయాలని ప్రజలకు వివరించారు జరగరానిది ఏదైనా జరిగితే కుటుంబం రోడ్డు పాలు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో చిలిపి చెడు మండల ఏఎస్ఐ రాములు మాట్లాడుతూ ప్రయాణికులు జాగ్రత్తగా వాహనాలను నడపాలని సూచించారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి మరియు మద్యం తాగి వాహనాలు నడపరాదని ప్రజలకు సూచించారు అలాగే వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని చండూరు గ్రామసభలో ప్రజలందరికీ తెలియజేశారు ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలి అలాగే కాగితాలు వెంబట పెట్టుకొని వాహనానికి ఇన్సూరెన్స్ తప్పకుండా చేయించుకోవాలని ప్రజలకు తగు సూచనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిలిపి చెడు మండల ఏఎస్ఐ రాములు గ్రామ సెక్రెటరీ జితేందర్ గ్రామ సర్పంచ్ శేషాద్రి ఉపసర్పంచ్ వెంకటేశం వార్డు మెంబర్లు అంగన్వాడీ టీచర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు తదనంతరం వాహనానికి సంబంధించిన వాహన ప్రమాణ ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు