Listen to this article

జనం న్యూస్, 2026 ఏప్రిల్ 13, కొల్లూరు గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు )

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండల పరిధిలోని, కొల్లూరు గ్రామంలోని, రామేశ్వర స్వామి, దేవాలయానికి చెందిన, వ్యవసాయ భూమి, సర్వే నెంబరు 123 మరియు 124 లో, సుమారు 10 ఎకరముల భూమి, కాలపరిమితి రెండు సంవత్సరాలు. ఇట్టి వ్యవసాయ భూమిని, కౌలుకు ఇచ్చుటకొరకు, తేదీ 15 ఏప్రిల్ 2026 న, బుధవారం ఉదయం 11:30 గంటలకు, హనుమాన్ మందిరం వద్ద, వేలం వేయబడునని, ఆసక్తి కలిగిన వారు, రూ. 5000/- రూపాయలు, చెల్లించి , బహిరంగ వేలంలో పాల్గొనవచ్చని, ఆలయ ఈవో, శివ రుద్రప్ప తెలిపారు.