Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జహీరాబాద్, ఏప్రిల్ 12:

హుగ్గెల్లి గ్రామ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామంలో 167 వ పల్లె సంకీర్తన ఘనంగా జరిగింది. గ్రామ ఆంజనేయ స్వామి మందిరం నుండి బయలు దేరిన శోభాయాత్ర ప్రధాన వీధుల గుండా సాగి తిరిగి ఆలయాన్ని చేరుకొంది. శ్రీ కృష్ణ కీర్తనలు ఆలపిస్తూ చిన్నారులు చేసిన నృత్యాలు మంత్ర ముగ్దలను చేశాయి. ఈ పల్లె సంకీర్తన తో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.